ముఖ్యమంత్రి జగన్ జురుసలేం బయలుదేరారు.


అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు జెరుసలెం బయలుదేరి వెళ్లనున్నారు. 


జగన్​తో పాటు ఆయన కుటుంబ సభ్యులూ వెళ్లనున్నారు. 


హైదరాబాద్ లోటస్ పాండ్ సమీపంలోని నివాసానికి జగన్ సహా కుటుంబ సభ్యులు చేరుకున్నారు. 


మధ్యాహ్నం 3 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని ముంబయి వెళ్తారు. 


అక్కడి నుంచి విమానంలో నేరుగా జెరుసలెం వెళ్తారు. 


అక్కడే నాలుగు రోజులపాటు సీఎం జగన్ సహా కుటుంబసభ్యులు బస చేస్తారు. 


ఈ నెల 5న తిరుగు పయనమవుతారు. జెరుసలేం నుంచి ముంబయికి వచ్చి నేరుగా విజయవాడకు వస్తారు. 


సీఎం పర్యటన పూర్తి వ్యక్తిగతమని అధికార వర్గాలు తెలిపాయి.