ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును మరచిపోయిన తెరాస అవకాశవాద రాజకీయాలను ఎండగట్టేందుకు సోమవారం మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెదేపా నాయకులు వెల్లడించారు. ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో నగర బాధ్యుడు పిన్నమనేని సాయిబాబా మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామని చెప్పిన కేసీఆర్ తన అయోమయ నిర్ణయాలతో నగరాన్ని అధఃపాతాళానికి దించేశారని విమర్శించారు. రెండు పడక గదుల ఇళ్లను రెండులక్షల వరకు నిర్మించి ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటనకు స్పందించి ఐదులక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని.. పాతికవేల ఇళ్లను కూడా కట్టలేదన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీపతి సతీష్‌కుమార్, నగర నాయకులు నల్లెల్ల కిషోర్, బిల్డర్ ప్రవీణ్, ముప్పిడి మధూకర్, బాలరాజ్‌గౌడ్, ఎం.కె.బోస్, రవీంద్రచారి, యాదగిరిరావు, కొమరన్న పాల్గొన్నారు.