అవినీతి చేసిన గీతాంజలి కళాశాల ఈసీఐల్ పరీక్ష కేంద్రం రద్దుచేయాలి

 



అవినీతి చేసిన గీతాంజలి కళాశాల ఈసీఐఎల్  విద్యా సంస్థల (SDLCE) పరీక్ష కేంద్రం రద్దు చేయాలి


చర్యలు తీసుకోవాల్సిన  అధికారులు అమ్ముడు పోతున్నారు


2014లో అవినీతి చేసిన సెయింట్ మేరీ కాలేజీ యాజమాన్యం ( ప్రస్తుత గీతాంజలి కళాశాల)  పరీక్ష కేంద్రం వెంటనే రద్దు చేయాలని  ఎస్ఎఫ్ఐ నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో కళ్ళకు కట్టుకొని నిరసన


ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు పడాల శంకర్ మాట్లాడుతూ...


గతంలో లో 2014 జూలై 18న స్వామి వివేకానంద సొసైటీ సెంట్ మేరీ అని పేరు పెట్టుకుని పేపర్ లీకేజ్ చేయడం జరిగింది, దానికి కాకతీయ యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకొని రద్దు చేయడం జరిగింది


 మళ్లీ 2017 సెప్టెంబర్ నెలలో కొత్తగా స్వామి వివేకానంద సొసైటీ మీద గీతాంజలి కాలేజీ అని పేరు మార్చి అనుమతులు తీసుకున్నారు, వెంటనే రెండు నెలల గడవకముందే పరీక్ష కేంద్రం కూడా అనుమతి తీసుకున్నారు, కాకతీయ యూనివర్సిటీ అధికారులు ఎలా అనుమతి ఇస్తారు గీతాంజలి కళాశాల యాజమాన్యం అనుమతులు తీసుకుని విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు, అంతేగాక  2017 నుంచి విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ కి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన యూనివర్సిటీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
 విద్యార్థుల దగ్గర నుండి ఒక సబ్జెక్టు 3000 నుంచి 5000 వరకు డబ్బులు వసూలు చేసి పాస్ చేయిస్తామని  నమ్మిస్తున్నారు, ఈ డబ్బులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది గత వారం రెండు రోజుల క్రితం కాకతీయ అధికారులను కలిసి వినతి పత్రం ఇచ్చిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పి  పరీక్ష కేంద్రం కి అనుమతి ఇచ్చారు*, అంటే ప్రభుత్వ అధికారులు గీతాంజలి యాజమాన్యం కుమ్మక్కయ్యారని అనిపిస్తుంది విద్యార్థులను మోసం చేస్తున్న చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు ఇప్పటికైనా కాకతీయ యూనివర్సిటీ అధికారులు స్పందించి ఉన్నత విద్యా మండలి అధికారులు చర్యలు తీసుకొని గీతాంజలి కళాశాల రద్దు చేయాలని మోసపోతున్న విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాము.
అంతేకాకుండా చాలా మంది విద్యార్థులకు హాల్టికెట్లు అవకతవకలు జరగడం వలన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు
లేనియెడల ఉన్నత విద్యా మండలి ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు


ఈ కార్యక్రమంలో కాప్రా బాధ్యుడు సాయి తరుణ్, తేజ, రాజు రాకేష్ రెడ్డి  సందీప్ తదితరులు పాల్గొన్నారు.