మహిళా సహకార సంగం బ్యాంక్ ప్రారంభోత్సవం

నేడు బెంగుళూరులో శ్రీనివాసనగర్ కనక కాంప్లెక్స్ లో  అహల్యబాయి హోల్కర్ పాతిన మహిళా సహకార సంగం బ్యాంక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వర్యులు సిద్ధరామయ్య గారు,మాజీ మంత్రివర్యులు HM రేవన్న గారు,బండెప్పగారు,కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ శ్రీమతి సవితమ్మగారు,బ్యాంక్ చైర్ పర్సన్ ప్రభావతమ్మ గారు..ఈ సమావేశంలో సవితమ్మగారు మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మహిళాబ్యాంక్ ను ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని,మన కులస్తులు ఎక్కడ ఉన్నా అభివృద్ధి కి తోడ్పడాలని,మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలని  పిలుపునిచ్చారు.సవితమ్మగారు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని బుద్ధుడి విగ్రహం ఇచ్చి ఘనంగా సన్మానించింది...