పెళ్లి జరగాల్సినపుడు జరుగుతుంది

 


నాది ప్రేమ వివాహం కూడా కావొచ్చు..ప్రభాస్‌  
పెళ్లి జరగాల్సినప్పుడు జరుగుతుందిహైదరాబాద్‌: టాలీవుడ్‌ కథానాయకుడు ప్రభాస్‌ పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆయన్ను పెళ్లి గురించి మీడియా ప్రశ్నించింది. ప్రభాస్‌ ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? అని అడగగా.. 'డార్లింగ్‌' సమాధానం చెప్పారు. 'పెళ్లి జరగాల్సిన సమయంలో జరుగుతుంది. అది ప్రేమ వివాహం కూడా కావొచ్చు' అని అన్నారు.


అనంతరం 'సాహో' కోసం రూ.100 కోట్లు పారితోషికంగా తీసుకున్నారా? అని ప్రశ్నించగా.. 'ఈ సినిమా నిర్మాత నా స్నేహితుడు. కేవలం ఓ పోరాట ఘట్టం కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశాం. సినిమాలోని ఓ భాగం బడ్జెట్‌ నా పారితోషికం' అని ప్రభాస్‌ చెప్పారు.


'సాహో' సినిమాకు సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధా కపూర్‌ కథానాయిక. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తనీష్‌ బాగ్చి, జిబ్రాన్‌(నేపథ్య) సంగీతం అందిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం రామోజీఫిల్మ్‌ సిటీలో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక జరగనుంది.