2028 ఒలంపిక్స్ లో క్రికెట్

 


2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌!



ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అందుకు తగ్గట్టే 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడానికి ఐసీసీ ప్రయత్నాలు చేస్తోందని అంతర్జాతీయ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌ మైక్‌ గాట్టింగ్‌ పేర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని క్రీడా సమాఖ్యలను పర్యవేక్షించే వాడా (వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ)కు అనుబంధంగా కొనసాగుతున్న నాడా(నేషనల్‌ ఆంటీ డోపింగ్‌ ఏజెన్సీ) పరిధిలోకి ఇటీవలే బీసీసీఐ చేరింది. దీంతో ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడానికి ఉన్న పెద్ద అడ్డంకి తొలగిపోయిందని ఆయన తెలిపారు