స్టాఫ్ నర్స్ మృతి తీరనిలోటు

 


   స్టాఫ్ నర్స్ మృతి  తీరనిలోటు


   డుంబ్రిగుడా ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో విధులు నిర్వర్తిస్తున్నా  కాంట్రాక్ట్ ఉద్యోగి కిముడు సుశీల స్టాఫ్ నర్స్ అనారోగ్యం (బోన్ టి బి, కాన్సర్) తో మృతి చెందడం చాలా బాధాకరమైన విషయమని, చిన్న వయసులోనే   తన వృత్తిలో ఎంతో అంకితభావంతో పనిచేసే దని, మంచి వర్కర్ గా ఎందరో అధికారుల మన్ననాలు పొందిందని, ఆస్పత్రికి వచ్చే రోగులతో మంచి స్నేహ భావం కలిగి ఉండేదని అలాంటి మంచి వ్యక్తి నేడు కనుమరుగవ్వడం చాలా విచారకరమని సుశీల పార్థివ దేహాన్ని సందర్శించిన  యూనియన్ నాయకులు శెట్టి నాగరాజు విచారం వ్యక్తం చేస్తూ , వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.   ఈ కార్యక్రమంలో  డుంబ్రిగుడ  వైద్యాధికారులు, సిబ్బంది తరువున  దహన సంస్కరణల ఖర్చు నిమిత్తం 11000 రూ,,లను మరణించిన సుశీల కుటుంబ సభ్యులకు యూనియన్ ప్రతినిధుల సమక్షంలో అందించారు, సుశీల కు రావలసిన బకాయి జీతాలు వచ్చేలాగా చూస్తామని వైద్యాధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కె. రవీంద్ర, జి.మురళి స్టాఫ్ అందరూ పాల్గొని నివాళులర్పించారు. 


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?