వినుకొండ మున్సిపాలిటీ లో నిధులు గోల్మాల్


 


వినుకొండ మున్సిపాలిటీలో నిధుల గోలమాల్...?


 గుంటూరు జిల్లా వినుకొండలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు చెల్లించవలసిన పి.యప్ డబ్బులు దాదాపు 20 లక్షల రూపాయల పైగా గోలమాల్ జరిగినట్టు విశ్వసనీయ సమాచారం


 వినుకొండ మున్సిపాలిటీలో స్విపింగ్ విధులు నిర్వహిస్తున్న దాదాపు120 మందికి పైగా పి యప్ నెలకు 1500 రూపాయల చొప్పున 11 నెలలకు ఉద్యోగుల జీతం నుండి కటింగ్ చేశారు ఈ డబ్బు విధిగా కాంట్రాక్టర్లు వారి వారి పియఫ్ ఖాతాలో చెల్లింపు జరపాలి ఇందుకు మున్సిపల్ కమిషనర్ పూర్తి బాధ్యత వహించాలి


 ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్ కూడా మెతక వైఖరి అవలంభిస్తున్నారు


 11 నెలల నుండి పియఫ్ చెల్లింపు చేయకపోవడంతో కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు


 ఈ మధ్యకాలంలో ముగ్గురు కాంట్రాక్టు ఉద్యోగులు మరణించారు 


 పియఫ్ చెల్లించకపోవడంతో  మరణించిన ఉద్యోగుల కుటుంబాల సభ్యులు పి యప్ ఫింఛన్ కోల్పోతున్నారు


 అందరూ శాఖాహారులే మరి బుట్టలోని రొయ్యల పొట్టు ఏమైనట్లు అధికారులే తేల్చాలి


అవినీతిని సహించను సహించను అంటున్న వినుకొండ శాసనసభ్యులు మరి ఈ విషయం లో ఎలా స్పందిస్తారో వేచిచూడాలి మరి..!