తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం మరియు గ్రామములో వేంచేసియున్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అమలాపురం పార్లమెంటరీ సభ్యురాలు శ్రీమతి చింత అనురాధ గారు, ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పొన్నాడ సతీష్ కుమార్ గారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి వారు, ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికినారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే శ్రీ పొన్నాడ సతీష్ కుమార్ గారు 1116 కొబ్బరి కాయలు మ్రొక్కుబడిని శ్రీ స్వామి వారికి సమర్పించినారు. అనంతరం కార్యనిర్వహణాధికారి వారు శ్రీ స్వామి వారి చిత్రపటమును, ప్రసాదములను, వినాయకుని మట్టి ప్రతిమలను అందజేసినారు.
విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అమలాపురం పార్లమెంటరీ సభ్యురాలు శ్రీమతి చింత అనురాధ