వక్ఫ్‌బోర్డులో భారీగా అవకతవకలు

 


వక్ఫ్‌బోర్డులో భారీగా అవకతవకలు


పాలకమండలిని రద్దు


అమరావతి : వక్ఫ్‌బోర్డులో భారీగా అవకతవకలు జరిగాయని, అందుకే దాని పాలకమండలిని రద్దు చేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వక్ప్‌బోర్డులో అవకతవకలపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలన్న షోకాజ్‌ నోటీసులను పాలకమండలి లెక్క చేయలేదన్నారు. అందుకే వక్ఫ్‌ చట్టంలోని సెక్షన్‌ 99 మేరకు పాలకమండలిని రద్దు చేశామని వివరించారు. బోర్డులో నిబంధనల మేరకు ఉండాల్సినంతమంది సభ్యులు లేకపోవడం కూడా బోర్డు రద్దుకు ఓ కారణమని పేర్కొన్నారు.