3జీ సేవలను నిలిపివేస్తున్నారు

 


3జీ సేవలను నిలిపివేయనన్నారు 


ఢిల్లీ : ప్రముఖ  టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అందిస్తోన్న 3జీ సేవలకు త్వరలో మంగళం పాడాలని నిర్ణయించింది. భారతి ఎయిర్‌టెల్ సీఈఓ గోపాల్ విట్టల్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన.. 2020 మార్చి నాటికి దేశ వ్యాప్తంగా అందిస్తున్న 3జీ సేవలను నిలిపివేయనున్నట్లు తెలిపారు. 22 టెలికాం సర్కిల్ల ద్వారా అందిస్తున్న 3జీ సేవలను అంచెలంచెలుగా నిలిపివేయనున్నట్టు తెలిపారు.