మధ్యప్రదేశ్ మాజీ సీ ఎం బాబూలాల్ గౌర్ కన్నుమూత


 


మధ్యప్రదేశ్ మాజీ సీఎం బాబులాల్ గౌర్ కన్నుమూత


భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ గౌర్ బుధవారం ఉదయం కన్నుమూశారు.


 అనారోగ్యంతో భోపాల్ నగరంలోని నర్మద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించారు.


 బీజేపీ నాయకుడైన బాబులాల్ పదిసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వృద్ధాప్యంతో గత ఏడాది రాజకీయాల నుంచి వైదొలిగారు.


 ఆర్ఎస్ఎస్ కు చెందిన బాబులాల్ 2004లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు.