కెఈబీ పనులను పర్యవేక్షణ చేసిన ఎమ్మెల్యే

కె ఈ బీ పనులు 


మద్దూరు వద్ద కెఈబీ కెనాల్ లో బద్దనాచు తొలగింపు పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే సింహాద్రి.


దివిసీమ పంట కాలువలో సాగు నీటి సరఫరాకు ఆటంకం గా మారిన బద్దనాచు తొలగింపు పనులను ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుగారు ఆదివారం పర్యవేక్షించారు.మద్దూరు వద్ద ఫంటు ప్రొక్లెయిన్ ద్వారా తొలగిస్థున్న బద్దనాచు పనులను ఆయన పరిశీలించారు.  యనమలకుదురు లాకులు నుండి  వల్లూరు పాలెం మద్య కె.ఈ.బీ కెనాల్ లో  జరుగుతున్న బద్దనాచు తొలగింపు పనుల గురించి ఇరిగేషన్ ఈఈ ఎ.రాజా స్వరూప్ కుమార్ ని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఈఈ మాట్లాడుతూ రెండు రోజుల నుంచి 2 ఫంటు ప్రొక్లెయిన్లు పనిచేస్తున్నాయని, ఐదారు రోజుల్లో తొలగింపు కార్యక్రమం పూర్తవుతుందని చెప్పారు. ప్రస్తుతం కెఈబీ కెనాల్ కు 1150 క్యూసెక్కులు సాగునీటిని విడుదల చేయగా,నిమ్మగడ్డ లాకుల వద్ద 320 క్యూసెక్కులు సరఫరా అవుతునట్టు  చెప్పారు.ఈ పనులు పూర్తయితే దివిసీమకు  పూర్తిస్థాయిలో సాగునీటి సరఫరా అవుతుందని ఈ.ఈ తెలిపారు.ఈ కార్యక్రమం పూర్తవగానే సాగునీటి సరఫరా పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి మాట్లాడుతూ దివిసీమ రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని, వీలైనంత త్వరగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి  కడవకొల్లు  నరసింహారావుగారు, ఇరిగేషన్ డీఈ వెంకటేశ్వరరావు, జేఈ  శ్రీరామ జనార్ధన్ పాల్గొన్నారు.