పార్కులను కాపాడండి


 


భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ


*మున్సిపల్ పార్కుల్లో ఇతర కట్టడాలు కట్టడం చట్టవ్యతిరేకం*


*సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సౌత్ కమల నగర్ ప్రభుత్వ పాఠశాల పక్కన పార్కులో సీనియర్ సిటిజన్స్ కి కేటాయిస్తామని మరో బిల్డింగ్ కు  ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి శంకుస్థాపన అడ్డుకున్న స్థానికులు,*


  *గ్రౌండ్లో కట్టడాలు నిర్మించవద్దని మోకాళ్ల పై ఎస్ఎఫ్ఐ నిరసన*


*ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు పడాల శంకర్ మాట్లాడుతూ...*


సౌత్ kamalanagar ప్రభుత్వ పాఠశాల పక్కనే ఉన్న మున్సిపల్ గ్రౌండ్  గతంలో సీనియర్ సిటిజన్స్ కి అందమైన మంచి భవనాన్ని కట్టించారు అది విశాలంగా అద్భుతంగా ఉంది కానీ కొంతమంది తెరాస నాయకుల కోసం అదనంగా ఇంకో భవనాన్ని నిర్మించడం కోసం 150 గజాలు భూమి కేటాయించారు దానిని శంకుస్థాపన చేయడం కోసం ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు వచ్చారు రు నిర్మించవద్దని శంకుస్థాపన ను అడ్డుకున్న ఎమ్మెల్యే గారు ఇది ముసలి వాళ్ళ కోసం సహకరించండి  దీన్ని వెనక్కి తీసుకోమని అన్నట్లు నిర్లక్ష్యపు సమాధానం చెప్పడం జరిగింది,


*ప్రభుత్వ పార్కుల్లో ఎలాంటి కట్టడాలు నిర్మించవద్దని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది ఆ విషయం ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు చట్టాలను చదవాలని కోరుతున్నాము*


విద్యార్థులు స్వేచ్ఛగా ఉండేది కేవలం ఆటల్లోనే అలాంటి ఆటలు ఆడుకోవడానికి హైదరాబాద్ మహానగరంలో ఆటస్థలాలు కరువయ్యాయి సౌత్ కమల నగర్ లో వెయ్యి గజాల లో ఉన్న స్థలాన్ని కూడా ఈరోజు చేయాలని చూస్తున్న పాలకవర్గాలు పిల్లల అడ్డుకోవడం సరి కాదని ఇప్పుడు ఉన్న భవనం చాలా బాగుంది విశాలంగా ఉన్న సీనియర్ సిటిజన్ వరకు సరిపోతుంది కాబట్టి కొత్తగా సీనియర్ సిటిజన్ పేరుతోని పిల్లల స్వేచ్ఛ అంటే మేము ఊరుకోము అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు కూడా ఆడుకోవడానికి బాగుంటుంది, ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు కార్పొరేటర్ గారు ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వ అ నిధులను వృధా చేయకుండా అదే కాలనీలో రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థ ఇబ్బందికరంగా ఉందని వాటి దృష్టి సాధించాలని పిల్లల స్వేచ్ఛ కావాలని గ్రౌండ్లో చేపట్టే నిర్మాణాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు,


*లేనియెడల పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని అవసరమైతే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు.*


*ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కాప్రా బాధ్యుడు సాయి, స్థానికులు సతీష్ లోకేష్ చైతన్య సుభాష్ పెద్దవారు వెంకటయ్య సక్కుబాయి తదితర విద్యార్థులు చిన్న పిల్లలు యువకులు తదితరులు పాల్గొన్నారు


           
      


Popular posts