రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్‌


అమరావతి: సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్‌కు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పదవి కట్టబెట్టింది. జర్నలిజంలో ఆయనకున్న అపార అనుభాన్ని సీఎం జగన్ వినియోగించుకోవాలని భావించారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా అమర్‌ను ఎంపిక చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన జాతీయ మీడియా, పొరుగు రాష్ట్రాలతో సంబంధాల విషయంలో సలహాదారుగా వ్యవహరించనున్నారు.1976లో ఈనాడు దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అమర్ అడుగుపెట్టారు. ప్రజాతంత్ర దినపత్రిక వ్యవస్థాపక సంపాదకుడిగా పనిచేశారు. ఆయన రెండుసార్లు ఉమ్మడి ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా ఉన్నారు. అంతేకాదు ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌(ఐజేయూ) అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం అమర్ సాక్షి టీవీలో కన్సల్టింగ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.