పంతం ప్రాణాలమీదకు

 


వరంగల్‌ : క్షణికావేశం ఊరిని చిత్రవధ చేసింది. పంతం ప్రాణాల మీదికి తెచ్చింది. ద్వేషం నిండిన మనుషులకు ఏనాడైనా శిక్ష తప్పదనే విషయాన్ని న్యాయస్థానం మరోసారి నిరూపించింది. పంతాలకు పట్టింపులకు పోయి అటు హతుని కుటుంబం, ఇటు హతుల కుటుంబాలు చిత్రవధకు గురవుతున్నాయి. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం పాల కంకులతో ఉన్న జొన్నచేను నెత్తుటి మరకలు పూసుకుంటే ఇవ్వాళ చేను తాలూకు నెత్తురు ఆ కుటుంబాలను వీడని దుఃఖాన్ని అద్దింది. చట్టం ఎవరికీ చుట్టం కాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఉత్సవాలు, ఊరేగింపులని సంబురాలతో అలరారాల్సిన కుటుంబాలు ఒక్కసారిగా జీవితాంతపు విషాదాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. తన కళ్లెదుటే కట్టుకున్న భర్త విలవిల్లాడుతూ నెత్తుటి మడుగులో విగత జీవుడు కావడం ఆ భార్య తట్టుకోలేకపోయింది. చిన్న వయస్సులో ఇద్దరు పిల్లలతో వైధవ్యాన్ని భరిస్తూ తన భర్తను పొట్టనపెట్టుకున్న వారికి శిక్షపడాలనే పట్టుదలతో న్యాయం కోసం ఎదురుచూసిన ఆమెకు న్యాయం దక్కింది. వంద మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఇక నిర్ధోషికి మాత్రం శిక్ష పడకూడదనే న్యాయమే గెలిచింది. అభంశుభం తెలియని ఆ ఇల్లాలి ఉసురు ఉప్పెనలా ఎగిసిపడింది. అదే సమయంలో చిన్నచిన్న పంతాలతో పట్టింపులతో తాము తన ముందు చిన్నగైపోతున్నామని ఒకే ఒక్క కారణంతో క్షణికావేశానికి లోనై అతన్ని తప్పిస్తేనే తమకు మనశ్శాంతి అని భావించిన వారికి తమ వల్ల అన్నెపున్నెం ఎరుగని ఆ 16 కుటుంబాలు పుట్టెడు శోకంలో మునిగిపోతాయని ఏ ఒక్కరూ ఆలోచించకపోవడం వల్ల ఈ దారుణం జరిగింది. చైతన్యానికి మారుపేరుగా నిలవాల్సిన వరంగల్‌లో దారుణం చోటుచేసుకుని ఒక వ్యక్తి హత్యకు పురికొల్పిన పరిస్థితులేమైనా సరే హత్యచేయడాన్ని మాత్రం న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఇటువంటివి పునరావృతం కాకూడదన్న భయం సమాజంలో ఉండాలి అన్న సంకేతాన్ని కోర్టు తీర్పు ద్వారా ఇచ్చినట్టు అయింది. హసన్‌పర్తి మండలం ముచ్చర్ల, నాగారం గ్రామాల మధ్య 2012లో జరిగిన దారుణహత్యకు సంబంధించిన సోమవారం వరంగల్‌ ప్రధాన న్యాయమూర్తి తిరుమలాదేవి విలక్షణ తీర్పు ఇచ్చారు. రాష్ట్రంలో సంచలనం రేపే తీర్పుగా న్యాయ కోవిధులు అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం నాగారం సర్పంచ్‌గా ఉన్న రఘు అతనితోపాటు మరో 15 మందికి జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.


అందరూ మరచిపోయినా


హత్య జరిగి దాదాపు ఏనిమిదేళ్లు అయింది. హతుడి కుటుంబం, హతుల కుటుంబాలు సైతం చట్టం తమకు ఉపశమనం కలిగిస్తుందని భావించారు. బలమైన సాక్ష్యాలు బలహీన పడతాయని భావించారు. కానీ అందరూ మరచిపోయినా సరే న్యాయం మేల్కొనే ఉందని ఈ తీర్పు స్పష్టం చేసింది. 'జస్టిస్‌ డి లేయిడ్‌ ఈజ్‌ జస్టిస్‌ డినైడ్‌' కాదు 'జస్టిస్‌ ఈజ్‌ ఆల్వేస్‌ జస్టిస్‌' అని నిరూపించే ఘటన ఇది. పెండ్లి ఊరేగింపు నుంచి వచ్చిన కొద్దిసేపటికే హత్యకు గురైన అశోక్‌రెడ్డి ఇంట్లో చావు డప్పు మోగింది. కేసు నమోదు చేసిన పోలీసులు తమ విచారణను, ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించే పనిలో నిమగ్నమై బలమైన సాక్ష్యాలను సేకరిస్తూ అనేక వాద ప్రతివాదాలకు అనుగుణమైన సాక్ష్యాలను ప్రవేశపెడుతూనే ఉన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఏవో నాలుగు రోజులు హడావుడి జరిగిన తర్వాత అంతా సమసిపోతుందని భావించే పరిస్థితి ఉండదు. తప్పు చేసిన వాళ్లు ఎంతటివారైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అని ఇటు న్యాయస్థానం, అటు పోలీసులు అదే పనిలో నిమగ్నం అయ్యారని తీర్పు అనంతరం అందరికీ తెలిసివచ్చింది.


17 కుటుంబాల్లో కన్నీటి ఛాయలు


సోమవారం కోర్టు ప్రాంగణం అంతా కన్నీళ్లతో తడిసిపోయింది. జిల్లాలో సంచనలం రేపిన ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పు వెలువడుతుంది అన్న విషయం తెలుసుకున్న నాగారానికి చెందిన నిందితుల కుటుంబ సభ్యులే కాకుండా వారి బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున జిల్లా కోర్టు ప్రాంగణానికి తరలివచ్చారు. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠతో క్షణక్షణం ఊపిరి బిగపట్టి ఉండిపోయారు. సాయంత్రం ఐదున్నర ప్రాంతంలో తీర్పు వెలువడింది. ఒక్కసారిగా విషాదఛాయలు, మిన్నంటిన రోదనలు. అశోక్‌రెడ్డి హత్యకేసులో సర్పంచ్‌ రఘుసహా 16 మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పు వెలువర్చగానే ఒక్కసారిగా ఘోల్లుమనే రోదనలు. కన్నీటి కాలువలై పారాయి. దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా అశోక్‌రెడ్డి కుటుంబం ఏ వ్యథను అయితే అనుభవించిందో అదే దుఃఖాన్ని హతుల కుటుంబాలు అనుభవించాయి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు 16 మంది ప్రణాళిక వేసుకొని సినీ ఫక్కీలో వ్యక్తిని దారుణంగా హతమార్చడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. అందులో ఏ ఒక్కరైనా ఇది తప్పు, ఇలా చేయకూడదు అని ఆలోచించి ఉంటే ఇంతదారుణం జరగకపోయేది. అటు హతుని కుటుంబం, హతుల కుటుంబాలు ఈ రోజు ఇంతటి క్షోభకు గురయ్యేవి కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. వాళ్లు చేసిన తప్పులకు వారిని నమ్ముకున్న వారి కుటుంబాలు రోడ్డు పాలు అయ్యే దుస్థితి దాపురించింది. ఒక్క క్షణం విచక్షణతో అందులో ఏ ఒక్కరూ గుర్తుచేసినా ఇంతదారుణం జరగకపోయేది అనేది తీర్పు అనంతరం కోర్టు ప్రాంగణంలో వ్యక్తం అవుతున్న అభిప్రాయాలు. వ్యక్తిగ