మంత్రికి సొంత పార్టీ నేతల నుంచే నిరసన

 


నెల్లూరు: మంత్రికి సొంత పార్టీ నేతల నుంచే నిరసన ఎదురైంది. చిట్టమూరు మండలం మల్లామ్‌లో మంత్రి అనిల్‌కుమార్‌ కాన్వాయ్‌ని వైసీపీ నేతలు అడ్డుకున్నారు. ప్రజాభిప్రాయం తీసుకోకుండా సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానం కమిటీని ఎంపిక చేశారని నిరసన తెలిపారు. ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు నమ్మక ద్రోహం చేసి.. సమాధానం చెప్పకుండా వెళ్లి పోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి, ఎమ్మెల్యే రేణిగుంట ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా ఘటన జరిగింది.