చిన్న పత్రికలకు ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వాలి

 


రాష్ట్ర సమాచార శాఖలో ఎంపానెల్ మెంట్ కలిగిన స్మాల్ అండ్ మీడియం దినపత్రికలకు గత ప్రభుత్వంలో మాదిరిగానే ఈ ప్రభుత్వంలోనూ అన్యాయం జరుగుతుంది . యాడ్స్ విడుదల చేయటం లేదు .దీనికి గతంలోనూ, ఇప్పుడూు   మన పత్రికలపై చిన్న చూపు ,వివక్షత  ఒక కారణమైతే, మన స్వయంకృపరాధం, చేతగానితనం మరొక కారణం. అధికారంలోకి వచ్చిన గత మూడు నెలల కాలంలో ఒక యాడ్ కూడా మనకు విడుదల చేయలేదు. సీఎం గారు ప్రమాణ స్వీకారం రోజున సాక్షి , ఈనాడు పత్రికలకు అన్ని ఎడిషన్లకు 2 ఫుల్ పేజీ  యాడ్స్  విడుదల చేశారు,  రంజాన్ యాడ్ సాక్షి  ,ఈనాడు లతోపాటు  మరో రెండు మూడు    పెద్ద పేపర్లకు విడుదల చేశారు.  రైతు దినోత్సవం , స్వాతంత్ర దినోత్సవం యాడ్స్ సాక్షి,ఈనాడు అన్ని ఎడిషన్లకు విడుదల చేశారు .ఒక్క చిన్న యాడ్ కూడా స్మాల్ అండ్ స్మాల్ అండ్ మీడియం దినపత్రికలకు ఇవ్వలేదు. ఇది కూడా పత్రికా స్వేచ్చపై దాడే.మన మనుగడ ప్రశ్నార్థకమౌవుతోంది. పంతాలు ,పట్టింపులు, భయాలు పక్కనపెట్టి స్మాల్ అండ్ మీడియం దినపత్రికల పబ్లిషర్లు
అందరూ  ఒకే తాటిపైకి వచ్చి మన వాటా మనం దక్కించుకునేందుకు  ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి.