దేవినేని అవినాష్ పార్టీ మారడు


 


దేవినేని అవినాష్ పార్టీ మారరు.


తెలుగుదేశం పార్టీ కేడర్ ఈ రూమర్స్ ను నమ్మకండి. ఆయన పర్సనల్ గా కూడా ఈ వార్తలను ఖండించారు. నెహ్రూ గారు చనిపోయేముందు అవినాష్ ని పార్టీ లో చేర్చి ఓ నిర్ణయం తీసుకున్నారు. చిన్ని అదే నిర్ణయం కొనసాగిస్తాడు. 


ఎవరూ సాహసం చేయని కొడాలి నాని మీద పోటీకి సై అని.. విజయమో వీర స్వర్గమో అన్న రీతిలో..  ఊరు కాని ఊరిలో అందరూ ముక్కు మీద వేలేసుకునే విధంగా తన సత్తా చాటాడు. గెలుపు ఓటమి పక్కన పెడితే రాష్ట్రంలో కేడర్ చూపు తనవైపు తిప్పి అందరి మన్ననలు పొందాడు.


పార్టీ ఓటమిపాలైన సమయంలో అందరికంటే ముందుగా గుడివాడలో కార్యకర్తల సమావేశం నిర్వహించి కేడర్ కు ధైర్యం చెప్పారు. తెలుగుయువత నాయకుడిగా కేడర్ మీద దాడులు జరుగుతూన్న సమయంలో కూడా బాధితులను పరామర్శించి వారిలో ఆత్మవిశ్వాసం నింపాడు అవినాష్. 


నిజమే ఈ సమయంలో ఇలాంటి వార్తలు రాకూడదు. కేడర్ సహజం గానే అపోహ పడతారు. కానీ ఆరు నూరైనా అవినాష్ కేరక్టర్ గల నాయకుడు. చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు.. అవి పార్టీ మారేంతగా కాదు. పార్టీ కష్ట కాలంలో చంద్రబాబు గారికి వెన్నంటే ఉంటాడు. దేవినేని అభిమానులు పార్టీ కేడర్ ఈ పుకార్లను ఖండించండి.


అవినాష్ తెలుగుదేశం పార్టీ తోనే 
చంద్రబాబు గారి వెంటే..
నమ్మండి. ఇది వాస్తవం 


బాధ్యత కలిగిన నెహ్రూ గారి 
అభిమానిగా, పార్టీ కార్యకర్తగా,ఈ రూమర్స్ ని ఖండించడం నా కర్తవ్యంగా భావించి ఈమాటలు చెపుతున్నా  ము.