నెల్లూరు రూరల్ పరిధిలోని మాజీ టీడీపీ కార్పొరేటర్లు, నేతలు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో రూరల్ కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అధ్యక్షతన దాసరి రాజేష్, మల్లెబోయిన వెంకటేశ్వర్లు యాదవ్, పావళ్ల ప్రసాద్, దారా వంశీ తదితరులు వైసీపీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ. .
పార్టీలోకి చేరినవారిని గౌరవంగా చూస్తామని శ్రీధర్ రెడ్డి చెప్పారు.
పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం, మంచి గౌరవం ఇస్తాము.
గతంలో కూడా రూరల్ నుంచి పార్టీలోకి వలసలు ఎక్కువగా వచ్చాయి.
ప్రస్తుతం కూడా పార్టీలోకి వలసలు ఎక్కువగా వస్తున్నారు. అందరికి పార్టీలో మంచి గౌరవం ఉంటుంది.
రూరల్ నియోజకవర్గ ము లో ప్రజల గుండెచప్పుడు కు అనుకూలంగా పనిచేస్తాం. మనకు గతంలో ఓటు వేయని వారి మనసు గెలుచుకుని వచ్చే ఎన్నికల్లో మనకు మనకు ఓటు వేసే విధంగా పనిచేద్దామని జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా ముందుకు వెళ్తాము.
ఈ కార్యక్రమంలో ఆనం విజయ కుమార్ రెడ్డి, రూప్ కుమార్ యాదవ్, రంగారెడ్డి, వై. వి రామిరెడ్డి, తాటి వెంకటేశ్వర రావు, బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, మిద్దె మురళీ కృష్ణా యాదవ్, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.