పంట సాగుదారు రైతు హక్కల కార్డులు రాష్ట్రప్రభుత్వమే బాధ్యత తీసుకుని కౌలురైతులకు జారీ చేయాలని, తద్వారా సున్న వడ్డీకి పంట రుణాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్ నాగిరెడ్డిగార్కి విజ్ఞప్తి చేసింది. ఈరోజు విజయవాడలో వైఎస్సార్ సిపి రాష్ట్ర కార్యాలయంలో సంఘం ప్రతినిధుల బృందం నాగిరెడ్డి గారిని కలసి మెమోరాండమ్ ను ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పంటల ఉత్పత్తుల కోసం కేటాయించే అన్ని పథకాలను వాస్తవ సాగుదారులైన కౌలురైతుల కు అందించే విధంగా "ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారు హక్కల చట్టం 2019,లో పొందు పర్చాలని రైతుమిషన్ ను డిమాండ్ చేసారు.పంటల రుణాలు,పెట్టుబడిసాయం, పంట ల భీమా, రైతు బీమా, ఇన్ పుట్స్ సబ్సిడీలు అందించాలని కోరారు. కొత్త చట్టం అమలల్లోకి వచ్చే వరకు ఇప్పటికే రుణ అర్హత కార్డులు పొందిన కౌలురైతులకు ఈ ఖరీఫ్ లోనే ఆన్నిరకాల సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ఆధ్యక్షలు నాగబోయిన రంగారావు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య నాగిరెడ్డిగార్కి విన్నవించారు.సంఘం సమర్పించిన వినతిపత్రం తీసుకున్న నాగిరెడ్డి స్పపందిస్తూ కౌలురైతులకు న్యాయం చేస్తామన్నారు.
పంట సాగుదారు రైతు హక్కుల కార్డు కౌలు రైతులకు ప్రభుత్వం ఇవ్వాలి