నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.... జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి 24 సంవత్సరాల యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మల్లవోలుకు చెందిన నాగరాజు ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నారు. రాత్రి ఎదో తెలియని విషపురుగు కుట్టిందని రాత్రి 3గంటలకు జిల్లాప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. గంట గడిచిన తరువాత పరిస్థితి సీరియస్ గా ఉంది విజయవాడ తీసుకెళ్లామని డాక్టర్స్ సూచించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉండాల్సిన అంబులెన్స్ ను అధికారులు ధారాదత్తం చేయటం వల్ల ప్రయివేటు అంబులెన్స్ భారం మోయలేక ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కేవలం రెండు రోజులలో అంబులెన్స్ వస్తుంది అని మీడియాకు ప్రకటించిన వారి జాడలేదు. కొసమెరుపు: బాడీ పి.ఎం చేయకుండానే బంధువులకు అప్పగించడం కొసమెరుపు.