హైదరాబాద్ మహానగరంలో నీటిపొదుపు కొరకు జీహెచ్ఎంసీ మరియు జలమండలి చేపట్టిన వాక్ కార్యక్రమాన్ని కేంద్ర జల్ శక్తి అభియాన్ బృంద సభ్యులు పరిశీలించారు. బుధవారం ఎస్ ఆర్ నగర్ విడిజన్ లోని మాతానగర్ క్షేత్రస్థాయిలో కేంద్ర జల్ శక్తి అభియాన్ డిప్యూటీ సెక్రెటరీ మరియు బ్లాక్ నోడల్ అధికారి డా. గౌరీ శంకర్, జల్ శక్తి అభియాన్ డైరెక్టర్ మరియు టెక్నికల్ అధికారి శ్రీ. ఎం. రవికుమార్, జల్ శక్తి అభియాన్ డిప్యూటీ డైరెక్టర్ మరియు నోడల్ అధికారి శ్రీ. ఎం. రామారావు గార్లు సంబంధిత స్థానిక జలమండలి జీఎమ్. పి. ప్రభు, ఇతర అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా నీటి వృథా జరుగుతున్న తీరు, వినియోగదారులకు నీటి ప్రాముఖ్యతను ఏవిధంగా తెలియజేస్తున్న విషయం, స్థానిక మహిళలు, ఎన్జీవోలు, విద్యార్థులు,కాలనీ సంఘాలను వాలంటీర్లుగా ముందుకు రావడం వంటి విషయాలను జల్ శక్తి అభియాన్ సభ్యుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.
నీటి పొదుపు కొరకు వాక్