చంద్రబాబు కు తెలుగు మహిళలు విన్నపం

 


చంద్రబాబు కు మైలవరం తెలుగు చెల్లెళ్ళ మోర


_విజయవాడ(మైలవరం) :- మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు మైలవరం మండలానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు ప్రభుత్వం తమపై చేస్తున్న దాడుల గూర్చి, అక్రమ కేసులు గూర్చి ఫిర్యాదు చేశారు. ఇటీవల మైలవరం పట్టణంలో అన్న క్యాంటీన్ తొలగించటం తో పాటు 17 దేశం శ్రేణులు  పై అక్రమ కేసులు బనాయించారని చెప్పారు. మంగళవారం సాయంత్రం విజయవాడలో జరిగిన రాష్ట్ర పార్టీ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా స్వయంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి ఈ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, వైకాపా ప్రభుత్వ అరాచకాలను గుండె ధైర్యంతో ఎదురొడ్డి పోరాడాలని వారికి సూచించారు. ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క తప్పుడు పనిని నిగ్గదీయలని వారికి ధైర్యం చెప్పారు.