నూతన వాహన చట్టం - ప్రజలు అసంతృప్తి

నూతన వాహన చట్టం - అసంతృప్తి


 


*పన్నులు మావే.. పెనాల్టీ మాకే*


●విధులు నిర్వహించని మిమ్మల్నేం చేయాలి..?
●ఇవేం చట్టాలు..ఎందుకీ నిబంధనలు


●పాలకులు, అధికారుల తీరుపై నెటిజన్ల మండిపాటు.


●సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సందేశం.


★నూతన వాహన చట్టం, భారీ జరిమానాల విధిoపు నిర్ణయంపై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. *పన్నులు కట్టే ప్రజలే పెనాల్టీలూ చెల్లించాలి* వారికి కనీస వసతులు కల్పించకుండా.. విధి నిర్వహణలో విఫలమవుతోన్న అధికారులు, ఉద్యోగులపై చర్యలుండవా..? అని ప్రశ్నిస్తున్నారు.


★సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు సంబంధించి కొత్త జరిమానాలు అమలులోకి రానున్న నేపథ్యంలో నెటిజన్లు మండిపడుతున్నారు.
 
●హెల్మెట్‌ లేకుంటే రూ.1000 జరిమానా విధిస్తున్నారు.. అదే రోడ్డుపై గుంతలో పడి పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు..? మరి పాలకులు, అధికారులకు ఎంత పెనాల్టీ వేయాలి..? ఏ శిక్ష విధించాలి. 


●నో పార్కింగ్‌ జోన్‌లో వాహనం నిలిపితే రూ. వెయ్యి వసూలు చేస్తున్నారు... రోడ్డు పక్కనుండే ఫుట్‌పాత్‌ ఆక్రమణలు ఎందుకు తొలగించరు..? 


●సిగ్నల్‌ జంప్‌ చేస్తే పెనాల్టీ చలానా ఇంటికి పంపుతారు..? పని చేయని సిగ్నల్‌ మరమ్మతును ఎందుకు పట్టించుకోరు..? 


●ట్రిపుల్‌ డ్రైవింగ్‌ చేస్తే ఫైన్‌ వేస్తున్నారు.. రహదారులపై మురుగు పొంగి పొర్లితే ఎందుకు స్పందించరు..? 


●నిషేధిత ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నారని జరిమానా విధిస్తున్నారు.. కంపెనీలు సీజ్‌ చేస్తున్నారు..? రాజకీయ నేతలు ఏర్పాటుచేసే ఫ్లెక్సీలు మీకెందుకు కనిపించవు..? అని సోషల్‌ మీడియా వేదికగా పౌరులు ప్రశ్నిస్తున్నారు.


●నిబంధనలు, చట్టాలు ప్రజలకు మాత్రమేనా..?  మిగతా అన్నిటికి ఎందుకు జరిమానాలు విధించరు..? అని నిలదీస్తున్నారు.
 
●మా ఆదాయంతో మీ ఎంజాయ్‌మెంట్‌...
పన్నులు చెల్లిస్తోన్న ప్రజలే అంతిమంగా బాధపడుతున్నారు. ఇబ్బందులు పడుతున్నారు. తుదకు ప్రాణాలూ కోల్పోతున్నారు. మళ్లీ వారిపైనే జరిమానాల భారం. ప్రభుత్వ ఖజానా నింపుకునేందుకు పన్నులు, పెనాల్టీలు చెల్లిస్తూనే ఉండాలా..? 


●మా శ్రమ మీరు ఎంజాయ్‌ చేయడానికా..? అని ప్రశ్నిస్తున్నారు. ఈ మెస్సేజ్‌ రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ సందేశం అందరికి చేరాలని... వారిలో అవగాహన వచ్చినప్పుడే పాలకుల్లో మార్పు ఆశించగలమన్నది వారి అభిప్రాయం.


Govt తో కూడా వీటికి ఫైన్ లు కట్టించండి 


రోడ్లపై ఒక్కో గుంతకి -1000/- 
కంకర తేలితే - 2000/- 
దుమ్ము లేగిస్తే -3000/- 
నీరు నిలిస్తే -5000/- 


రోడ్లు బాగు చేసి అప్పుడు అడగండి ఫైన్లు..