విజయవాడ: '' గోవుల విషయంలో ఘోరం జరిగిపోయింది. సేవ చేస్తున్నా నిందలు మోయాల్సి వస్తోంది. పైగా గోవుల పోషణకు లక్షలు ఖర్చవుతోంది. దీని కంటే ఆరోగ్యంగా ఉన్న గోవులను పెంచుకోవడానికి ఆసక్తి ఉన్న రైతులకు ఇవ్వడమే మేలు'' అని గోశాల నిర్వాహకులు భావించారు. పశుసంవర్థక శాఖ అధికారులు చేసిన ప్రతిపాదనలకు అంగీకరించారు . గోసంరక్షణ సంఘం సభ్యులు ఆదివారం ఉదయం గోశాలలో సమావేశమయ్యారు. జరిగిన పరిణామాలపై కూలంకషంగా చర్చించుకున్నారు. అనంతరం ఇక్కడ ఆరోగ్యవంతంగా గోవులను రైతులకు ఇవ్వడానికి సమ్మతించారు.