హెచ్ సీ ఏల్ లో ఉద్యోగ అవకాశాలు

 


శంకుస్థాపన చేసుకుని ఏడాది తిరగకుండానే ఉద్యోగాలను ఇస్తోంది హెచ్‌సీఎల్‌.    
            
కృష్ణా జిల్లా, గన్నవరం మండలం, కేసరపల్లి వద్ద అక్టోబర్ 8, 2018 తేదీన  అంతర్జాతీయ సంస్థ హెచ్‌సీఎల్‌ భవనానికి శంకుస్థాపన చేసారు నాటి ఐటీ శాఖామంత్రి నారా లోకేష్. లోకేష్ కృషి మూలంగా ఏపీకి తరలివచ్చిన ఐటీ సంస్థల్లో  అతి పెద్ద ఐటీ సంస్థ  హెచ్‌సీఎల్‌.  రెండుదశల్లో రూ.750 కోట్ల పెట్టుబడికి, 7,500 ఉద్యోగాలకు హామీ ఇచ్చిన  హెచ్‌సీఎల్‌ సంస్థ...  


ఒక నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేసి స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకునే విధంగా మాటిచ్చింది. 


ఆ మాట ప్రకారమే ఇప్పుడు హెచ్‌సీఎల్‌ సంస్థ  నియామక ప్రక్రియ చేపట్టింది. ఆగష్టు 10, 2019న స్థానిక అంటే విజయవాడ పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులను ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలకు హాజరు కమ్మని ఇచ్చిన ప్రకటన ఇది. ఎంపికైన అభ్యర్థులకు 6 నెలల శిక్షణ ఇచ్చి అనంతరం డెవలపర్, అనలిస్ట్, టెస్టర్, ప్రోడక్ట్ సపోర్ట్ ఇంజనీర్. ఉద్యోగాల్లోకి తీసుకుంటుంది హెచ్‌సీఎల్‌.


Popular posts