అన్నవరం సత్యదేవుని మూల విరాట్ కు పళ్లతో అలంకరణ

తూ.గో.జిల్లా 
అన్నవరంలోని సత్యనారాయణ స్వామి ఆవిర్భావ వేడుకల్లో భాగంగా తొలిసారిగా ఆగస్టు 2న స్వామివారి మూలవిరాట్ను వివిధ రకాల ఫలాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించడానికి ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో ఎం.వి.సురేష్బాబు తెలిపారు. ఆగస్టు 1, 2 తేదీల్లో స్వామివారి ఆవిర్భావ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని  ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం గణపతిపూజ, పుణ్యాహవాచనం, దీక్షా వస్త్రధారణ, జపాలు, పారాయణాలు, హోమాలు, ఆయుష్యహోమం జరుగుతాయని తెలిపారు. ఆరోజు సాయంత్రం నాలుగు గంటలకు మండపారాధన, నీరాజన మంత్ర పుష్పం తదితర పూజలు నిర్వహిస్తామని చెప్పారు.


Popular posts