స్టూడియోలోనే విష్ణువర్ధన్ రెడ్డికి లీగల్ నోటీస్ పంపి, షాక్ ఇచ్చిన కుటుంబరావు !

స్టూడియోలోనే విష్ణువర్ధన్ రెడ్డికి లీగల్ నోటీస్ పంపి, షాక్ ఇచ్చిన కుటుంబరావు !


గత అయుదు సంవత్సరాలుగా చుస్తునే ఉన్నాం. ఎంత మంచి పని చేసినా, ఆ మంచి కనిపించకుండా, ఎదురు బురద చల్లటం చూస్తున్నాం. ఇష్టం వచ్చినట్టు బురద చల్లుతారు, తెలుగుదేశం నేతలు ఆ బురద మాకు ఎక్కడ అంటుతుందో అని దాన్ని కడుక్కోవటం, అది కడుక్కుంటూ ఉండగానే, మరో బురద చల్లటం.. ఇలా ప్రతి రోజు తప్పుడు ప్రచారం చేస్తూ, ప్రతి రోజు తెలుగుదేశం నేతలు బురద కడుక్కుంటూనే చేసేవారు. అప్పట్లో బీజేపీ నేతలు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ లాంటి వారికి, ప్రతి రోజు ఇదే పని. అప్పట్లో వాళ్ళు ఆరోపణలు చేసిన ప్రతిది తప్పు అని, ఇప్పుడు కేంద్రంలో ఉన్న వాళ్ళ ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది, జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయ్యింది. అయినా సరే బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, ప్రతి రోజు చంద్రబాబు పై బురద చల్లే పనిలోనే ఉన్నారు.


నాలుగు నెలల్లో జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని, ప్రతి రోజు బీజేపీ నేతలు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణతో సహా గగ్గోలు పెడుతుంటే, విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం, బీజేపీ అధికార ప్రతినిధిగా కాకుండా, జగన్ మోహాన్ రెడ్డి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారనే వాదన వినిపిస్తుంది. నిన్న జరిగిన ఒక టీవీ చర్చ కార్యక్రమంలో ఈ విషయం మరోసారి రుజువైంది. విద్యుత్ ఒప్పందాల అంశం పై ఒక ప్రముఖ టీవీ ఛానెల్ లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా, ఏపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి లైవ్ లోనే లీగల్ నోటీసులు పంపించారు. ఒక పక్క కేంద్రంలో ఉన్న మంత్రి, గత ప్రభుత్వం తప్పు లేదు, అన్నీ మా పర్యవేక్షణలోనే జరిగాయి, ఎలాంటి అవినీతి జరగలేదు అని చెప్తుంటే, అదే పార్టీకి చెందిన విష్ణు వర్ధన్ రెడ్డి మాత్రం, తప్పు అంతా చంద్రబాబుదే అని చెప్పారు.
ఈ సందర్భంగా, చర్చలో ఉన్న కుటుంబరావు పై బురద చల్లే ప్రయత్నం చేసారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో రవిరెడ్డి అనే వ్యక్తి, కుటుంబరావులు మధ్యవర్తులుగా వ్యవహరించి, చంద్రబాబుతో కలిసి అనేక అక్రమ ఒప్పందాలు చేశారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. అయితే అందరిలా కాకుండా, దీనిపై వెంటనే స్పందించిన కుటుంబరావు ఆ ఆరోపణలను ఖండిస్తూ, నీకు లీగల్ నోటీస్ పంపిస్తున్నా, అంటూ మొబైల్ నుంచే నోటీస్ పంపించారు. రెండు రోజుల్లో లీగల్ నోటీస్ ఇంటికి పంపిస్తానని, నా పై అనవసర ఆరోపణలు చేసిన నిన్ను కోర్ట్ కి ఈడుస్తా అంటూ చెప్పారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డికి పంపిన లీగల్ నోటీసును కుటుంబరావు చదివి వినిపించారు. అయితే దీని పై సామాన్య ప్రజలు కూడా శభాష్ అంటున్నారు. ఇలా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్న వారికి, ఇలా లీగల్ నోటీసులు పంపించి, శిక్ష పడేలా చేస్తే, ఇంకొకరు ఇలా నోటికి వచ్చినట్టు కాకుండా, సబ్జెక్ట్ పై మాట్లాడతారని, ప్రజలకు అసలు విషయం తెలుస్తుందని అంటున్నారు.


Popular posts
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సీమాంధ్రుల కలల రాజధాని కోసం ఉద్యమిస్తాం*
Image
రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుం ది
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో