పారా మెడికల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు  నోటిఫికేషన్ విడుదల 

పారా మెడికల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు  నోటిఫికేషన్ విడుదల 


పారా మెడికల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు  నోటిఫికేషన్ విడుదల 
దరఖాస్తులను ఆహ్వానించిన కాళోజి హెల్త్ యూనివర్సిటీ
 సెప్టెంబర్ 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు 


కాళోజి హెల్త్ యూనివర్సిటీ , వరంగల్:  రాష్ట్ర వ్యాప్తంగా పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు యూనివర్సిటీ నేడు  నోటిఫికేషన్ విడుదల చేసింది.  సెప్టెంబర్ 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయన్నారు. నాలుగేళ్ల  డిగ్రీ కోర్సు బాచిలర్ ఆఫ్ నర్సింగ్ (బీఎస్సీ నర్సింగ్ ), రెండు సంవత్సరాల డిగ్రీ కోర్సు పోస్ట్ బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ (పీబీబీఎస్సీ నర్సింగ్‌),  బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపి ( బీపీటీ ),  బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజీ ( బీఎస్సీ ఎంఎల్‌టీ ) కోర్సుల్లో ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రవేశాలు ఉంటాయని వారు వివరించారు. అర్హులైన అభ్యర్థులు  ఉదయం 11 గంటల నుంచి 28 వ తేదీ సాయింత్రం 5గంటల  వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి.  దరఖాస్తు ప్రతిని యూనివర్సిటీ కి సమర్పించాలిసిన అవసరం లేదని స్పష్టం చేశారు.  ధ్రువ పత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను పొందుపరుచుతామని తెలిపారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ .www.knruhs.in. , www.knruhs.telangana.gov.in లో చూడాలని యూనివర్సిటీ వారు  ఒక ప్రకటనలో తెలిపారు.