ఇస్రో దిగ్విజయంగా అధిగమించింది.

అతి తక్కువ ఖర్చుతో, అందునా తొలి ప్రయోగాలతోనే.. విజయం సాధిస్తున్న ఇస్రో... అంతరిక్ష రంగంలో అగ్రరాజ్యాలను కూడా నివ్వెరపోయేలా చేస్తోంది. మీడియం లిఫ్ట్ హెవీ వెహికల్ అయిన జీఎస్ఎల్వీ మార్క్ త్రీ రాకెట్‌ని ఉపయోగించి కేవలం 978 కోట్ల రూపాయల అతి తక్కువ ఖర్చుతో ఇస్రో చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ చేపట్టింది.
చంద్రయాన్ 2 ప్రయోగంలో రెండు కీలక దశలున్నాయి. అవి లూనార్ ఆర్బిట్ ఇన్‌సర్షన్, రెండోది చంద్రుడి ఉపరితలం మీద సేఫ్ ల్యాండింగ్. వాటిలో మొదటి దశను ఇస్రో దిగ్విజయంగా అధిగమించింది.