వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం


 


అమరావతి: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులూ ఉత్తరాంధ్రకు భారీవర్ష సూచన ఉందని ఆర్టీజీఎస్ వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 72గంటల్లో ఉత్తరాంధ్ర, ఒడిశాలలో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది. అల్ప పీడనం వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారనుందని.. సముద్ర అలలు 2.5 మీటర్ల నుంచి 4 మీటర్ల ఎత్తువరకు ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. వేటకు వెళ్లే మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించింది.


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?