వక్ఫ్ బోర్డు స్థలాన్ని  కబ్జా చేయబోయిన తెలుగుదేశం పార్టీ నాయకులు


వక్ఫ్ బోర్డు స్థలాన్ని  కబ్జా చేయబోయిన తెలుగుదేశం పార్టీ నాయకులు


కృష్ణాజిల్లా పెడనపట్టణ జామియా మసీదు లోని  వక్ఫ  బోర్డు   నందు  నోటిఫై  అయిన భూమిని   నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేయాలని  చూసిన తెలుగుదేశం ఆ పార్టీ  మైనార్టీ నాయకులు  అబ్దుల్ రషీద్'  మహమూద్.  టిడిపి  నాయకుల   ప్రయత్నాన్ని అడ్డుకున్న జామియా మస్జిద్ కమిటీ సభ్యులు. స్థానిక పోలీస్ స్టేషన్ లో వక్ఫ్ బోర్డు స్థలాన్ని  కబ్జా చేయబోయిన తెలుగుదేశం పార్టీ నాయకులు అబ్దుల్ రషీద్  మహమ్మద్  సమద్  లపై  జామియా మస్జిద్ కమిటీ సభ్యులు పెడన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  అనంతరం   ఏపీ మైనార్టీ శాఖ మంత్రి  మరియు  ఉప ముఖ్యమంత్రి  అంజాద్ బాషా'  జిల్లా కలెక్టర్  ఇంతియాజ్'  వక్స్ బోర్డ్  జిల్లా అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన పెడన జామియా మసీదు కమిటీ.  టిడిపి నాయకుల కబ్జా వ్యవహారంపై  ఏపీ ఉపముఖ్యమంత్రి  అంజాద్ బాషా  జిల్లా కలెక్టర్  ఇంతియాజ్ స్పందించారు. ఈ మేరకు    Padana జామియా మసీదు లో వివాదాస్పదంగా మారిన భూమిపై విచారణ నిర్వహించి నివేదిక అందజేయాలని మంత్రి వక్ఫ అదికారులను  ఆదేశించారు.   ఏపీ ఉపముఖ్యమంత్రి   అంజాద్ బాషా  ఆదేశాలతో వక్ఫ  బోర్డు అధికారులు బుధవారం  వివాదాస్పద  భూమిని   సందర్శించారు.   జామియా మసీదు కమిటీ వద్ద ఉన్న పత్రాలను అధికారులు పరిశీలించారు. అనంతరం జరిగిన ఘటనపై నివేదిక  తాడు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నివేదికను  ఏపీ  ఉపముఖ్యమంత్రి తో పాటువక్ఫ  రాష్ట్ర సి ఓ సయ్యద్  సబర్ భాష  అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.  ఈ కార్యక్రమంలో వక్ఫ బోర్డ్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ అబ్దుల్  ఖుద్దూస్ . ఇన్స్పెక్టర్ ఆడిటర్ మొహమ్మద్ నుహా్  అలీషా .జామియా మసీదు కమిటీ కమిటీ పాల్గొన్నారు.