ఆత్మహత్యకు ప్రభుత్వమే ఒత్తిడి తెచ్చింది
మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపిం చారు. ఆయన తప్పు చేసి ఉంటే, యాక్షన్ తీసుకోవాల్సింది పోయి, ఇష్టమొచ్చినట్లు కేసులు పెట్టి మానసికంగా క్షోభ పెడతారా? అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడేం కాదని, చనిపోవాలని ప్రభుత్వమే ఒత్తిడి తెచ్చిందని ధ్వజమెత్తారు.

 

కోడెలను సమాజంలో నేరస్థుడిగా సృష్టించే ప్రయత్నం చేశారని, ప్రభుత్వ దాష్టీకం, దౌర్జన్యం పడలేకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని వర్ల ఆరోపించారు. ప్రభుత్వం, సీఎం జగన్‌పై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. కోడెల కొడుకు ఇక్కడ లేకున్నా, తండ్రి, కొడుకులు గొడవపడినట్లు చిత్రీకరించారని ఆయన ధ్వజమెత్తారు. రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లో ఆయన కొడుకు ఉన్నట్లు నిరూపించండని వర్ల రామయ్య సవాల్ విసిరారు.