ఏపీలో ఇంటికే నాణ్యమైన బియ్యం.. సీఎం జగన్.
శ్రీకాకుళం : పైలట్ ప్రాజెక్టు కింద తొలుత శ్రీకాకుళం జిల్లాలో వలంటీర్ల ద్వారా పేదల ఇంటికే పంపిణీ చేయనున్నారు.
ఈ కార్యక్రమాన్ని జగన్ కాశీబుగ్గలో ప్రారంభించారు. రేపటి నుంచి జిల్లావ్యాప్తంగా బియ్యం పంపిణీ పూర్తి చేయనున్నారు.
ఈ కార్యక్రమం రెండో విడతలో విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపడతారు. కాగా, జిల్లాను 15,344 క్లస్టర్లుగా విభజించారు.
వీటికి మొత్తం 11,924 మంది వలంటీర్లను నియమించారు. ఒక్కొక్క క్లస్టర్‌లో 50 నుంచి 60 వరకు కుటుంబాలను చేర్చారు.
వలంటీర్ల ద్వారా పేదలకు పంపిణీ చేసేందుకు ఇప్పటికే 9,48,105 బియ్యం బ్యాగ్‌లను 2,015 రేషన్ డిపోల్లో సిద్ధంగా ఉంచారు.
5 కిలోల బ్యాగ్‌లు 1,24,049, 10 కిలోల బ్యాగ్‌లు 2,42,035, 15 కిలోల బ్యాగ్‌లు 2,73,764, 20 కిలోల బ్యాగులు 3,08,257 ఉన్నాయి.
పంపిణీకి అంతరాయం తలెత్తితే సమస్యను వెంటనే పరిష్కరించేందుకు వీలుగా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
కార్డుదారుల మ్యాపింగ్‌లో సమస్యలు, పోర్టబులిటీ, డీలర్ లేదా వలంటీర్ అందుబాటు, యూనిట్‌లో తేడాలు రావడం వంటి ఇబ్బందులు ఏమైనా...
తలెత్తితే లబ్ధిదారులు నేరుగా కంట్రోల్ రూమ్‌కు ఫోన్ ద్వారా తెలియజేస్తే అక్కడికక్కడే పరిష్కరిస్తారు.