రాష్ట్ర గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం


రాష్ట్ర గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలతో ముఖాముఖికి గవర్నర్ తమిళిసై సన్నాహాలు చేస్తున్నారు. జనం సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలని నిర్ణయించారు. త్వరలోనే రాజ్‌భవన్‌లో వారానికి ఒకరోజు ప్రజాదర్బార్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, జనం సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాల్సిందిగా ఓ నెటిజన్ చేసిన సూచనకు గవర్నర్ తమిళిసై తన నిర్ణయాన్ని రీట్వీట్ చేశారు.