కోడెల విలువలున్న చాలా గొప్ప నాయకుడు

ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావును ప్రభుత్వమే హత్య చేయించిందని, ఏపీలో ఆటవికపాలన రాజ్యమేలుతోందని ఎంపీ కేశినేని నాని అన్నారు.   ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన హత్య అని ఆరోపించారు. అవమానభారంతో కోడెల ఆత్మహత్య చేసుకున్నారంటే.. రాష్ట్రం తలదించుకోవాలన్నారు. ఇటువంటి నీచ సంస్కృతి, ఆరాచక పాలన దేశంలో ఎక్కడ లేదని, జగన్, ఆయన పార్టీ నేతలు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. కోడెల ఆత్మహత్యతోనైనా జగన్‌కు కనువిప్పు కలిగి రాష్ట్రాన్ని మంచిగా పాలించాలని కేశినేని నాని సూచించారు. కోడెల విలువలున్న చాలా గొప్ప నాయకుడని, అలాంటి వ్యక్తులు సమాజంలో.. రాజకీయంలో ఉండాలన్నారు.