విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పళ్ళు పంపిణి


విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో వెంకటాచలం మండలం కసుమూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య వైద్యశాల లో గర్భిణీ స్త్రీలకు పళ్లను పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో   ప్రధాని నరేంద్ర మోడీ గారిచే ప్రవేశ పెట్టబడిన “పోషణ  అభియాన్” అను పథకం లో భాగంగా గర్భిణీ స్త్రీలకు పోషక ఆహరం మరియు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి అవగాహన కల్పించడం జరిగింది .కార్యక్రమంలో   NSS ప్రోగ్రాం ఆఫీసర్ డా''ఆర్ .ప్రభాకర్ గారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పారు. ముఖ్యంగా ఆహరం లో పాలు, గుడ్లు, పండ్లు మరియు ఎక్కువ శాతం పోషకాలు కలిగిన ఆహారాన్ని గర్భిణీ స్త్రీలు తీసుకోవాలని కోరారు . అదే మేరకు విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య విజయయానంద కుమార్ గారు మాట్లాడుతూ , ఇలాంటి కార్యక్రమాలు జాతీయ సేవా పథకం క్రింద NSS వాలంటీర్లు మరియు NSS సిబ్బంది కలిసి అవగాహనా సదస్సులు చేయడం చాల ఆనంద దాయకం అని, అదే విధంగా గర్భిణీ స్త్రీలకు పండ్లును పంపిణి చేశారు. “ఆరోగ్యమేమహాభాగ్యం" అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధి అధికారి డాక్టర్. జి .  శంక ర య్య గారు, సమన్వయకర్త డా ''ఉదయ్ శంకర్ అల్లం గారు, విశ్వవిద్యాలయ పి . ఆర్ . ఓ డా " నీలమణి కంఠ గారు ,అంతర్గత నాణ్యత హామీ విభాగం సమన్వయకర్త డా "క్రిరణ్మయీ గారు  మరియు వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు .


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
రాష్ట్ర స్థాయి పోటీలు
Image
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
వైసీపీ లో చేరికలు
శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని వెంకటేశ్వర కాలనీ లో ఈరోజు బస్తీ దవాఖానను ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు పేద ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనలో భాగంగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలకు దవాఖానాలు చేరువయ్యేలా ఉండాలని ప్రభుత్వ సంకల్పంతో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందేలా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ ఒక్క రోజు లో జి.హెచ్.యం.సి పరిధి లో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్ -22, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 05, సంగారెడ్డి జిల్లాలో 03 బస్తీ దవాఖానాల ప్రారంభం ప్రస్తుతం జి.హెచ్.యం.సి పరిధిలో 123 బస్తీ దవఖానాలు ప్రతిరోజూ 10 వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నాయి. నూతనంగా ప్రారంభించే 45 బస్తీ దవాఖానాల తో అదనంగా 4 వేల మందికి వైద్య సేవలు అందుతాయి. ఒక్కో బస్తీ దవఖాన లో ఒక వైద్యుడు, ఒక నర్స్, ఒక సహాయకుడు ఉంటారు. ప్రతి ఒక్కరు బస్తీ దవాఖాన సేవ‌ల‌ను వినియోగించుకోవాలి. బస్తీ దవాఖానల్లో ఆధునిక వైద్య పరికరాలు ఉంటాయి. పేద,మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఈ దవాఖానాలు ఉంటాయి. మన తెలంగాణ ను ఆరోగ్య తెలంగాణ గా మార్చుకుందాం. ఈ కార్యక్రమం లో కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు,యం.యల్.సి నవీన్ రావు గారు,యం.యల్.ఏ అరెకపూడి గాంధి గారు తదితరులు పాల్గొన్నారు.
Image