కోనసీమ లో 30.వరకు సెక్షన్ "30"అమలు

 కోనసీమ లో 30.వరకు సెక్షన్ "30"అమలు :


(తూర్పుగోదావరి -జి ఏన్ రావ్ 


అమలాపురం సెప్టెంబర్ 1: సెప్టెంబర్ నెల ఒకటో తేదీ నుంచి30 వ తేదీ వరకు  అమలాపురం పోలీసు సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్30 పోలీసు యాక్టు అమలులో ఉంటుందని అమలాపురం డీ.ఎస్పీ షేక్ మాసుం భాష శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. అందుచే ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, పబ్లిక్ మీటింగ్ లు, ఊరేగింపులు ,ర్యాలీలు విజయోత్సవ సభలు  ఇతరత్రా కార్యక్రమాలు మరియు నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదని ఆయన తెలిపారు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.