వ్యభిచారం ముఠా గుట్టురట్టు*

*వ్యభిచారం ముఠా గుట్టురట్టు*


 ప్రకాశం జిల్లాలో వ్యభిచారం ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. చీరాల రామకృష్ణా పురం పంచాయతీలోని బోడిపాలెంలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో నిర్వాహకులతో పాటు ఒక విటుడు, నలుగురు మహిళలను అరెస్టు చేశారు. అలాగే వారివద్ద నుంచి రూ. 9,230 నగదును స్వాధీనం చేసుకున్నారు. కోటమ్మ, శంకర్, గిరిబాబులు గత కొంతకాలంగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు.. డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న, భర్తలతో గొడవపడి విడిగా ఉంటున్న మహిళలను తీసుకొచ్చి వారిచేత వ్యభిచారం చేయిస్తున్నారు. దాంతో ఈ గృహంపై దాడి చేశారు పోలీసులు.


గతకొన్ని రోజులుగా చీరాల, ఈపురుపాలెం, గుంటూరు, విజయవాడ, వైజాగ్ వంటి ప్రాంతాలకు చెందిన మహిళలను చీరాలకు తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిర్వాహకుల తోపాటు, ఒక విటుడు, నలుగురు మహిళలను అరెస్ట్ చేశామని.. ఎవరైనా ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడి మహిళలను బలవంతంగా వ్యభిచార కూపంలోని దించినట్లయితే కఠినంగా శిక్షిస్తామని చీరాల ఒన్‌టౌన్‌ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) నాగ మల్లేశ్వరరావు హెచ్చరించారు. కాగా పట్టుబడ్డ వారిని కోర్టులో హాజరుపరచనున్నట్టు సీఐ స్పష్టం చేశారు.