తల్లీకూతుళ్లకు_ఒకేసారి_ప్రభుత్వఉద్యోగాలు

 


తల్లీకూతుళ్లకు_ఒకేసారి_ప్రభుత్వఉద్యోగాలు


చదువు ఆపేసిన పన్నెండేళ్లకు తిరిగి ప్రారంభించి ఏకంగా లెక్చరర్‌ ఉద్యోగం సాధించిన ఘనత తల్లిది. చిన్న వయసులో చైల్డ్‌ డవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగం తెచ్చుకున్న ఘనత కూతురిది. ఇద్దరూ ఒకే ఏడు పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకున్నతల్లి రౌతు పద్మ, కూతురు అలేఖ్య పటేల్‌ సక్సెస్‌ ఇది.. తల్లీ కూతుళ్లు పోటీ పడి చదువుకోవడం ఈ రోజుల్లో పెద్ద వింతేమీ కాకపోవచ్చు. కానీ ఇద్దరూ ఒకే ఏడు పోటీ పరీక్షలు రాసి, ఉత్తీర్ణత సాధించడం ఒక ఎత్తు అయితే .. విజయవంతంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం మరో ఎత్తు.


పెద్ద కుటుంబంలో చిన్న కోడలు


పెళ్లయిన 12 సంవత్సరాల తరువాత తిరిగి చదువును కొనసాగించాలనుకుంది పద్మ. అలా మొదలు పెట్టి.. రాసిన ప్రతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. డిగ్రీ పాసై అటు పైన పోస్టు గ్రాడ్యుయేషన్, బీఈడి, ఎంఈడీ, నెట్‌ అర్హతలు సాధించి అంతిమంగా టీఎస్‌పీఎస్‌సీ ద్వారా గురుకుల కళాశాలలో పీజీటీగా ఎంపికైంది. ఇపుడు సిరిసిల్ల జిల్లా చిన బోనాలలోని రెసిడెన్షియల్‌ కాలేజ్‌లో పీజీటీగా బాధ్యతలు నిర్వహిస్తోంది. తన విజయం గురించి పద్మ మాట్లాడుతూ – 'మాది మంథని దగ్గరి రామకృష్ణాపూర్‌.