ప్లాస్టిక్ వాడకం తగ్గించడంలో భాగస్వామ్యం కావాలి
అమలాపురం,
దేశ వ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధంపై చేపట్టిన కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్‌కుమార్ పిలుపునిచ్చారు. అమలాపురం మున్సిపాలిటీ 4, 8వార్డులలో ప్రధాని మోడీ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా గురువారం జరిగిన స్వచ్ భారత్ సేవా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు. గాంధీ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అనంతరం.4, 8 వార్డులలో అవగాహన ర్యాలీ నిర్వహించి
చేతి సంచులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యగారి కృష్ణసుందర్, జంగా రాజేంద్రప్రసాద్, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి గనిశెట్టి అరవింద్, మజ్దూర్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వీరబాబు, బసవా సింహాద్రి, గోకరకొండ గంగన్నస్వామి, కాటా బాలయ్య, సలాది నాగేశ్వరరావు, అరిగెల నాని, తూము నాయుడు, గన్నవరపు సూర్యభాస్కర్, అయ్యల బాషా, వంకాయల వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.