నల్లమలలో తవ్వకాల కోసం 2016లో తీర్మానం చేశారు

నల్లమలలో తవ్వకాల కోసం 2016లో తీర్మానం చేశారు . ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ కలిసి కాంగ్రెస్‌పై నెపం నెడుతున్నారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. తుమ్మలపల్లిలో చెంచులు లేరు, ఫారెస్ట్ లేదని వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి వెళ్లే నీళ్లు కలుషితం అవుతాయన్నారు. యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్న పవన్ కళ్యాణ్.. నల్లమలతో పాటు కడప జిల్లాలోనూ పర్యటించాలని రేవంత్ రెడ్డి సూచించారు. అక్కడికి తవ్వకాల కోసం వెళ్లే వారిని ఆపాలని పిలుపునిచ్చారు.