నూతన ఇసుక పాలసీకి ఏపీ కేబినేట్ ఆమోదించింది.
టన్ను ఇసుక ధర 375 రూపాయలుగా .. మంత్రి పేర్ని నాని
నూతన ఇసుక పాలసీకి ఏపీ కేబినేట్ ఆమోదించింది. టన్ను ఇసుక ధర 375 రూపాయలుగా నిర్ణయించినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ఇసుక రవాణా నిషేదించినట్లు వివరించారు. అవినీతి ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా అమ్మకాలు సాగిస్తామని ఆన్‌లైన్‌లోనే ఇసుక బుకింగ్ చేసుకోవాలని మంత్రి తెలిపారు. కొత్త ఇసుక పాలసీ రేపటి నుంచే అమల్లోకి వస్తుందని వివరించారు.