హెల్మెట్లు లేకుండా బైకు ర్యాలీ కుదరదని నర్సీపట్నంలో తెదేపా నేత అయ్యన్న పాత్రుని వర్గానికి అనుమతులు నిరాకరణ -

 


హెల్మెట్లు లేకుండా బైకు ర్యాలీ కుదరదని నర్సీపట్నంలో తెదేపా నేత అయ్యన్న పాత్రుని వర్గానికి అనుమతులు నిరాకరించిన - పోలీసులు...


ఆళ్ళ మానాన ఆళ్ళని తిరగనిచ్చి ఆనక హైల్మెట్లేకుండా తిరిగారనీ ఒక్కొక్కడికీ కొత్త రూలు ప్రకారం ఫైనేసుంటే సగం ఖజానా నిండేదిగా సామీ ...?? బొత్తిగా సత్తెకాలపు భటుల్లా ఉండారే...!!


 ఇకపై ఆంధ్రాలో ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న వారిక్కూడా హెల్మెట్ తప్పని సరి - అధికారులు ...


ముందీ రూలు స్ట్రిక్టుగా డిపార్టుమెంటోళ్ళని పాటించమని తరువాత జనాలకీ చెబితే బాగుంటాది సామీ ...!!


తెలంగాణలో హరిత హారంలో భాగంగా నాటిన మొక్కల కొమ్మలని మేక తినేసిందని దాని యజమానికి సుమారు 35 వేలు జరిమనా విధించిన ఓ పంచాయితీ ...


ఈ లెక్కన యురేనియం పేరుతో నల్లమల అడవులని మాయం చేసేద్దామని స్కెఛ్చు ఏసినోడికి ఉ...నా తప్పు లేదేమో...??


 మరోసారి వర్షానికి మునిగిన ముంబై మహా నగరం - నానా ఇబ్బందులూ పడ్డ జనం ...


ఆయనెవడో కాశ్మీరులో పెట్టుబడులెట్టేసి ఉద్ధరించేస్తానని స్టేట్మెంట్లిచ్చాడు - ముందర ఊర్లో మురుక్కాలవలు శుభ్రం చేసుకు సావమనండి ఆయన్ని...!!


 ఓ నదిపై చిన్న సైజు చెక్క వంతెన నిర్మించుకుని వంద కిలోమీటర్ల భారత భూభాగంలోనికి చొచ్చుకొచ్చి టెంపరరీ నివాసం ఏర్పరుచుకున్న - చైనా సైన్యం ...


ఇదంతా నెహ్రూ ఇందిరల చేతగానితనమె - తప్ప మరోటి కానే కాదని శంఖం ఊది మరీ చెప్పగలరు - వినేవాడుంటే...!


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
రాష్ట్ర స్థాయి పోటీలు
Image
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
వైసీపీ లో చేరికలు
శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని వెంకటేశ్వర కాలనీ లో ఈరోజు బస్తీ దవాఖానను ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు పేద ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనలో భాగంగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలకు దవాఖానాలు చేరువయ్యేలా ఉండాలని ప్రభుత్వ సంకల్పంతో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందేలా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ ఒక్క రోజు లో జి.హెచ్.యం.సి పరిధి లో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్ -22, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 05, సంగారెడ్డి జిల్లాలో 03 బస్తీ దవాఖానాల ప్రారంభం ప్రస్తుతం జి.హెచ్.యం.సి పరిధిలో 123 బస్తీ దవఖానాలు ప్రతిరోజూ 10 వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నాయి. నూతనంగా ప్రారంభించే 45 బస్తీ దవాఖానాల తో అదనంగా 4 వేల మందికి వైద్య సేవలు అందుతాయి. ఒక్కో బస్తీ దవఖాన లో ఒక వైద్యుడు, ఒక నర్స్, ఒక సహాయకుడు ఉంటారు. ప్రతి ఒక్కరు బస్తీ దవాఖాన సేవ‌ల‌ను వినియోగించుకోవాలి. బస్తీ దవాఖానల్లో ఆధునిక వైద్య పరికరాలు ఉంటాయి. పేద,మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఈ దవాఖానాలు ఉంటాయి. మన తెలంగాణ ను ఆరోగ్య తెలంగాణ గా మార్చుకుందాం. ఈ కార్యక్రమం లో కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు,యం.యల్.సి నవీన్ రావు గారు,యం.యల్.ఏ అరెకపూడి గాంధి గారు తదితరులు పాల్గొన్నారు.
Image