వైఎస్సార్‌సీపీలో చేరిన తోట త్రిమూర్తులు


వైఎస్సార్‌సీపీలో చేరిన తోట త్రిమూర్తులు
జిల్లా అభివృద్ధి కోసమే వైఎస్సార్‌సీపీలో చేరుతున్నా
ఏపీ అభివృద్ధి వైఎస్‌ జగన్‌తోనే సాధ్యం
పవన్‌  కల్యాణ్ కాపుల తరఫున మాట్లాడంలేదు
 సీఎం జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన తోట
తూర్పు గోదావరి :  టీడీపీ సీనియర్‌ నాయకులు, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆదివారం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు భారీగా అనుచరులు, కార్యకర్తలు ముఖ్య నాయకులు పార్టీలో చేరారు. రెండు రోజుల క్రితమే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ నియోజకవర్గ, జిల్లా అభివృద్ధి కోసమే తాను వైఎస్సార్‌సీపీలో చేరానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమర్థవంతమైన నేతను ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని అభిప్రాయపడ్డారు. ఏపీ అభివృద్ధి వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని, ఆ నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నానని స్పష్టం చేశారు. పార్టీలోని సీనియర్లతో కలిసి జిల్లా అభివృద్ధికి సహకరిస్తానని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ కాపుల తరుపున మాట్లాడలేదని, ఆయన అభిప్రాయం మాత్రమే అని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన అనంతరం.. టీడీపీని నమ్ముకుంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని గట్టిగా నమ్ముతున్న ఆ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా 'చంద్రబాబుకో దండం' అంటూ గుడ్‌బై చెప్పేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, తన అనుచరులతో కలిసి టీడీపీకి రాజీనామా చేయడం, వైఎస్సార్‌సీపీలో చేరడం జిల్లాలో టీడీపీని ఓ కుదుపు కుదిపింది. చంద్రబాబు నాయుడి వ్యవహార శైలి కారణంగా టీడీపీకి నానాటికీ ప్రజాదరణ తగ్గిపోతున్న నేపథ్యంలో.. ఆ పార్టీకి ఒక్కొక్కరుగా నాయకులు గుడ్‌బై చెప్పేస్తున్నారు.


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
రాష్ట్ర స్థాయి పోటీలు
Image
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
వైసీపీ లో చేరికలు
శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని వెంకటేశ్వర కాలనీ లో ఈరోజు బస్తీ దవాఖానను ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు పేద ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనలో భాగంగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలకు దవాఖానాలు చేరువయ్యేలా ఉండాలని ప్రభుత్వ సంకల్పంతో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందేలా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ ఒక్క రోజు లో జి.హెచ్.యం.సి పరిధి లో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్ -22, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 05, సంగారెడ్డి జిల్లాలో 03 బస్తీ దవాఖానాల ప్రారంభం ప్రస్తుతం జి.హెచ్.యం.సి పరిధిలో 123 బస్తీ దవఖానాలు ప్రతిరోజూ 10 వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నాయి. నూతనంగా ప్రారంభించే 45 బస్తీ దవాఖానాల తో అదనంగా 4 వేల మందికి వైద్య సేవలు అందుతాయి. ఒక్కో బస్తీ దవఖాన లో ఒక వైద్యుడు, ఒక నర్స్, ఒక సహాయకుడు ఉంటారు. ప్రతి ఒక్కరు బస్తీ దవాఖాన సేవ‌ల‌ను వినియోగించుకోవాలి. బస్తీ దవాఖానల్లో ఆధునిక వైద్య పరికరాలు ఉంటాయి. పేద,మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఈ దవాఖానాలు ఉంటాయి. మన తెలంగాణ ను ఆరోగ్య తెలంగాణ గా మార్చుకుందాం. ఈ కార్యక్రమం లో కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు,యం.యల్.సి నవీన్ రావు గారు,యం.యల్.ఏ అరెకపూడి గాంధి గారు తదితరులు పాల్గొన్నారు.
Image