వెరికోస్ వెయిన్స్ పై ఉచిత వైద్య శిబిరం


అమలాపురం షాదీఖానాలో వెరికోస్ వెయిన్స్, బోధవ్యాధి లపై హైదరాబాద్ ఎవిఏస్ ఆసుపత్రి సౌజన్యంతో ఏపియూడబ్లూజే, నల్లా చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.   వైద్యు లచే పరీక్షల అనంతరం మందుల పంపిణీ చేసారు.  అలాగే వినికిడి సమస్య వున్న  వారికి హియరింగ్ మిషన్లు కూడా ఉచితం.కాళ్ళల్లో నరాల వాపు,బోదకాలు సమస్యలపై ఉచిత వైద్య కార్యక్రమాల్లో భాగంగా  ఏర్పాటు చేసిన ఈ శిభిరంలో  వైద్య పరీక్షలు నిర్వహించారు.ఎవిస్ ఆసుపత్రికి చెందిన డాక్టర్    రాజా. వి. కొప్పాల , డాక్టర్ గౌస్   వైద్య సేవలు అందించారు.వందలాది మందికి పరీక్షలు నిర్వహించిన ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది..  ఆదివారం ఉదయం  నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ శిబిరాన్ని స్థానిక మున్సిపల్ కమిషనర్ కెవివి రాజు ప్రారంభించారు. నల్లా ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నల్లా పవన్ కుమార్ జ్వోతి ప్రజ్వలన చేయగా కార్యక్రమానికి ఏపియూడబ్లూజే జిల్లా కార్యదర్శి సుంకర ప్రసాద్ అధ్యక్షత వహించగా మాజీ మున్సిపల్ చైర్మన్ నల్లా విష్టుమూర్తి , ఏపియూడబ్లూజే స్టేట్ కౌన్సిల్ సభ్యుడు పివి సురేష్, జిల్లా ఉపాధ్యక్షుడు జగతా రాంబాబు, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆకుల రవితేజ,కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముదునూరి శ్రీనివాసరాజు, ఏవిఎస్ ఆసుపత్రి కో ఆర్థినేటర్ డి అచ్యుత్ తదితరులు హాజరయ్యారు.