రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం

రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం 01.09.2019 నుండి 30.09.2019 తేదీ వరకు నిర్వహించనున్నారు. *ఈ కార్యక్రమం ద్వారా 2020 జనవరి నాటికి "18 సంవత్సరాలు నిండి అర్హులైన వారిని కొత్త ఓటర్లుగా నమోదు చేసుకొనుటకు, "అనర్హులను మరియు చనిపోయినవారి ఓట్లను జాబితాలో తొలగించుటకు", "ఓటర్ల జాబితాలో వివరాలు/ ఫోటో తప్పుగా ప్రచురించబడినట్లయితే సరిచేసుకొనుటకు" అవకాశం ఉంటుంది.* _ముసాయిదా ఓటర్ల జాబితా 15.10. 2019న, తుది ఓటర్ల జాబితా జనవరి 2020 లో ప్రచురించబడుతాయి._


ఫారం నెం-6 (ఓటర్ల జాబితాలో పేరును చేర్పించడానికి దరఖాస్తు), ఫారం నెం-7 (అభ్యంతరం లేదా తొలగించడం కోసం దరఖాస్తు), ఫారం నెం-8 (వివరాలు సవరించుటకు  దరఖాస్తు), ఫారం నెం-8ఎ (పేరును నియోజకవర్గ పరిధిలో ఒక పోలింగ్ బూత్ నుండి వేరొక బూత్ పరిధిలోకి మార్చుటకొరకు దరఖాస్తు)
పైన తెలిపిన ఫారంతో పాటు
ఆధార్/ రేషన్ కార్డు/ ప్రభుత్వం ఆమోదించిన ఇతర పత్రాలు సమర్పించాలి. 
పైన తెలిపిన ఫారాల ద్వారా 
NVSP portal, 1950 కాల్ సెంటర్, E-సేవా / మీసేవా కేంద్రాలు, BLOల ద్వారా ఓటర్ల జాబితా సవరణల కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకోవాల్సిందిగా విజ్ఞప్తి.


_*రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్లుగా నమోదు చెయ్యగలరని మనవి.*_
వార్డు/ డివిజన్ లలో ఓటర్ల జాబితా మీద స్థానిక నాయకులు అవగాహన తెచ్చుకునే విధంగా చూడాల్సిందిగా విజ్ఞప్తి.