నల్లా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిభిరం


తూర్పుగోదావరిజిల్లా అమలాపురం నల్లా చారిటబుల్ ట్రస్ట్ మరియు ఏపీ డబ్లూ జే అమలాపురం శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ న అమలాపురం షాదీఖానాలో వెరికోసల్, బోధకాలు వ్యాధుల చికిత్స మరియు నివారణ కోసం ఉచిత మెగా వైద్య శిభిరం నిర్వహించనున్నట్లు నల్లా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు నల్లా పవన్ కుమార్ తెలిపారు.ఇందులో భాగంగా బుధవారం అమలాపురం కాటన్ అతిధి గృహం నందు ఐ జే యు సభ్యులు, సీనియర్ పాత్రికేయులు ఎం.ఎన్.వి.ప్రసాద్ చేతుల మీదుగా ఉచిత మెగా వైద్య శిభిరానికి సంభందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నల్లా పవన్ మాట్లాడుతూ వేరికోస్ వేయిన్స్ (కాళ్ళ నరాల వాపు వ్యాధి), లింఫిడిమా(బోదకాలు) వ్యాధుల తో బాధపడుతున్న వారు మరియు ఎక్కువ సమయం నిలబడి పనిచేసే వారికి ఈ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని అలాంటి వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన అవగాహన కల్పించి వైద్యం పొందాలని తెలిపారు.అమలాపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నక్కా రోనాల్డ్ మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహణలో పాత్రికేయుల ను కూడా భాగస్వాములను చేయడం సంతోషకరమైన విషయం అని,కాళ్ళ నరాల వాపు వ్యాధి ఎక్కువగా నిలబడి ఉండి పనిచేసే వారిలో పోలీసులు,కార్మికులకు ఈ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని ఇటువంటి వైద్య శిభిరాలు ఏర్పాటు చేసి ఉచిత వైద్యం అందించేందుకు కృషి చేస్తున్న నల్లా పవన్ ను అభినందిస్తూ ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఐ జే యు సభ్యులు ఎం ఎన్ వీ.ప్రసాద్ మాట్లాడుతూ ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు రాబోయే రోజుల్లో మరిన్ని ఏర్పాటు చేయాలని, బోదకాలు మరియు వెరికోస్ వెయిన్స్ వంటి వ్యాధులు వల్ల ఏ పనీ చేసుకోలేని విధంగా కొన్ని సందర్బాల్లో ఈ వ్యాధి వల్ల కాలు కోల్పోవాల్సి వస్తుంది అని ఇటువంటి వ్యాధుల నిర్మూలనకు లేజర్ చికిత్సతో పూర్తి స్థాయిలో తగ్గించవచ్చని ఈ వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ ఉచిత వైద్య శిబిరానికి ఏ వి యస్ హాస్పిటల్ హైదరాబాద్ కు చెందిన అమెరికా,లండన్ తదితర దేశాల్లో శిక్షణ పొందిన ప్రముఖ వైద్యనిపుణులు డాక్టర్ కొప్పాల.వి.రాజా, డాక్టర్  గౌస్ లు రానున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏపీ డబ్ల్యు జే జిల్లా కార్యదర్శి సుంకర ప్రసాద్,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సురేష్, ఏ.రవితేజ,పూర్ణిమ, ఆకొండి పవన్, నర్సింగరావు,జంగా. రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు