జాతీయ సేవా పథకంలో  ద్వితీయ స్ధానం సాధించిన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం


జాతీయ సేవా పథకంలో
 ద్వితీయ స్ధానం సాధించిన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంజాతీయ సేవా పథకంలో దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలు కనబరిచిన వారికి అందించే యన్ యస్ యస్ అవార్డు ను  రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ గారు అందజేశారు. మంగళవారం విశ్వవిద్యాలయాల విభాగంలో నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం  జాతీయస్ధాయిలో ద్వితీయ స్ధానం దక్కించుకుంది. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ గారి చేతులమీదుగా ట్రోఫీని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్ . సుదర్శన రావు గారు వెండి పతకం మరియు ధ్రువీకరణ పత్రం రూ . 2లక్షల నగదును ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ డా'' కె .రమేష్ రెడ్డి గారు అందుకున్నారు.